స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -281 లో.....సీతాకాంత్, రామలక్ష్మి లు వేరొక కంపెనీ హెడ్ రావడం కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడే నందిని కూడా వస్తుంది. ఆ తర్వాత అతను రాగానే అందరు వెల్ కమ్ చెప్తారు. చెప్పాగానే మాతో కలిసి పని చెయ్యడానికి వచ్చినందుకు థాంక్స్ అని నందిని అనగానే.. సీతాకాంత్ లాంటి వరితో కలిసి వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది.. అందుకు మీకే థాంక్స్ చెప్పాలని అతను అంటాడు. నందిని నీకు థాంక్స్ అని సీతాకాంత్ అనగానే.. నువ్వెప్పుడు ఉన్నతంగా ఉండాలనిదే నా కోరిక అనగానే నందిని వంక రామలక్ష్మి అదోలా చూస్తుంది.
ఆ తర్వాత అందరు మీటింగ్ కి వెళ్తుంటే.. నందిని స్లిప్ అవుతుంది. దాంతో నందిని అంటు సీతాకాంత్ కంగారు పడుతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పగానే.. సీతాకాంత్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకొని వచ్చి రామలక్ష్మి ఇస్తుంది. మరొకవైపు మీరు చెప్పిన విషయం నందినికి రామలక్ష్మి చెప్తుందా అని శ్రీవల్లి అనగానే.. చెప్తే మనకేం ప్రాబ్లమ్ లేదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత మీటింగ్ జరుగుతుంటే సీతాకాంత్ వంక నందిని చూడడం రామలక్ష్మి చూస్తుంది.ఆ తర్వాత రామలక్ష్మి మాట్లాడుతుంటే పోలమారుతుంది. దాంతో వాటర్ తాగు అని సీతకంత్ అంటాడు. దాంతో కావాలనే నందిని పొలమారినట్లు చెయ్యగానే సీతాకాంత్ తనకి వాటర్ ఇవ్వడంతో నా కంటే తనే ఎక్కువనా అన్నట్లు ఫీల్ అవుతుంది రామలక్ష్మి. ఆ తర్వాత మీటింగ్ ఒకే అయ్యాక ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. నాకు ఇష్టమైంది తినాలని ఉందన సీతాకాంత్ అంటాడు. మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చెయ్యాలా.. చేస్తానని నందిని అనగానే.. సరేనని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత మా ఆయనకి ఇష్టమైంది మీకెలా తెలుసని నందినిని రామలక్ష్మి అడుగగా తను డైవర్ట్ చేస్తుంది..
ఆ తర్వాత రామలక్ష్మి అసలు విషయం తెలుసుకోవాలని సీతాకాంత్ ని నందిని గురించి అడుగుతుంది. మొదట తెలియదన్న తన పైన ఒట్టేసి చెప్పమనగా సీతాకాంత్ నందిని గురించి చెప్తాడు. కానీ ఇప్పుడు ఫ్రెండ్ అంతే అని చెప్తాడు. కానీ ఈ విషయం ఇంతవరకు చెప్పనందుకు రామలక్ష్మి ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ధన ఫోన్ చూస్తూ.. సిరిని పట్టించుకోకుంటే రామలక్ష్మి వచ్చి కోప్పడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి గదిలోకి వెళ్లగానే సీతాకాంత్ వెనకాల నుండి వచ్చి బయపెడుతాడు. దాంతో రామలక్ష్మి చిరాకు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.